KDP: ప్రొద్దుటూరులో జరుగుతున్న ఎగ్జిబిషన్లో నిర్వాహకులు మున్సిపల్ గెజిట్ ప్రకారం అమలు చేయాల్సిన ధరల కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నారని, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని ప్రొద్దుటూరు వాసి మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రా రెడ్డికి బుధవారం ఫిర్యాదు చేశారు. కాగా, అధిక రేట్లతో దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.