NLR: కావలి డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో కావలి పట్టణంలో పోలీసులు హెల్మెట్ ధరించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం వల్ల మనల్ని మనం రక్షించుకున్నట్లే అవుతుందని, హెల్మెట్ ధరిస్తే ప్రమాదాల నుంచి బయటపడవచ్చని పేర్కొన్నారు.