GNTR: వెంగళాయపాలెంకు చెందిన ఓ వైసీపీ నాయకుడు నగ్న వీడియోలతో బెదిరించి అఘాయిత్యం చేయడమే కాకుండా నెలకు రూ.4వేలు తీసుకున్నాడని బాధితురాలు గుంటూరు ఎస్పీకి సోమవారం ఫిర్యాదు చేసింది. తన తినుబండారాల దుకాణంలో చోరీ చేసిన వ్యక్తిని తనకున్న పలుకుబడితో పట్టిస్తానని పరిచయం పెంచుకున్నాడని చెప్పింది. అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది.