BPT: చీరాల మండలం బుర్లవారి పాలెంలో సోమవారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్, పంచాయతీ భవనం, సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. వీలైనంత త్వరగా అభివృద్ధి పనులు ప్రారంభించి పూర్తి చేయాలని ఆయన గుత్తేదారులకు సూచించారు. అనంతరం పనులు నాణ్యతగా జరగాలన్నారు.