VSP: రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్థాపనతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కొత్త వెలుగులు నింపనుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నం ఉపకేంద్రం ప్రారంభోత్సవంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈ హబ్ రాష్ట్రానికి ఒక మైలురాయిలా నిలుస్తుందని పేర్కొన్నారు. దీనితో యువతకు ఉపాధికి దొరుకుతుందని అన్నారు.