VSP: ప్రతి ఆదివారం విశాఖలో నిర్వహించనున్న ప్రకృతి ఆధారిత పంటల సంత (ఆర్గానిక్ సంత)ను నగర ప్రజలు, వినియోగదారులు జయప్రదం చేయాలని గోఆధారిత ప్రకృతి రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మద్దిలపాలెంలో సంత జరుగుతుందని తెలిపారు.