శ్రీకాకుళం నగరం కార్పొరేషన్ స్థాయిలో అభివృద్ధి చెందుతోందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు, ట్రాఫిక్ సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వడానికి డే అండ్ నైట్ జంక్షన్ నుంచి రామలక్ష్మణ జంక్షన్ వరకు రహదారిని 80 అడుగుల రోడ్డుగా విస్తరించి ఆధునీకరించనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గొండు శంకర్ కూడా పాల్గొన్నారు.