AKP: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి మండలాభివృద్ధికి కృషి చేయాలని నాతవరం ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి అన్నారు. శుక్రవారం ఎంపీపీ అధ్యక్షతన మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.