కోనసీమ: అయినవిల్లి మండలం ముక్తేశ్వరం రేవు నుంచి కోటిపల్లి వెళ్ళుటకు పంటు ప్రయాణం నేటి నుంచి ప్రారంభమవుతుంది. గత 5 నెలల క్రితం వచ్చిన వరదలకు తాత్కాలిక రహదారి కొట్టుకుపోవడంతో పంటు ప్రయాణం నిలిపివేశారు. దీంతో అమలాపురం వాసులు కోటిపల్లి, ద్రాక్షారామం, రామచంద్రపురం వెళ్ళుటకు సుమారు 50 కిలోమీటర్లు తిరిగి వెళ్లే పరిస్థితి ఏర్పడింది.