VSP: పాత గాజువాక జంక్షన్ వద్ద పోలీసులు మంగళవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి జరిమానాలు విధించారు. హెల్మెట్, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే బస్ స్టాప్ వద్ద పెరుగుతున్న ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.