W.G: నరసాపురం రూరల్ మోడీ గ్రామానికి చెందిన మారెళ్ల రాంబాబు (48) హత్య కేసులో ఇద్దరిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. రాంబాబుకి జడ్డు నాయుడు, ఉంగరాల వీరన్నల మధ్య వివాదం చెలరేగడంతో ఆవేశానికి గురైన గురైన వారిద్దరూ రాంబాబును కొట్టారని తెలిపారు. ఈ ఘటనపై రాంబాబు భార్య వెంకట కుమారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.