ELR: విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఏలూరులో గురువారం నిరసన దీక్ష చేపట్టారు. ఏలూరు వసంత మహల్ సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయవద్దు అంటూ రైతు, వ్యవసాయ కార్మిక, కౌలు రైతు, చేతివృత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకారులు కదం తొక్కారు.