EG: జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం నియోజకవర్గంలో ఆడపిల్ల వివాహానికి రూ.20 వేలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా గోకవరంలో గడ్డం వెంకటేశ్వర చక్రవేణి దంపతుల కుమార్తె శ్రీలక్ష్మికి మండల కూటమి సభ్యుల చేతుల మీదుగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ తరపున రూ.20 వేల చెక్కును ఆదివారం అందజేశారు.