కృష్ణా:రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధరరావు అధికారులను ఆదేశించారు. ఎస్పీ అధ్యక్షతన మంగళవారం జిల్లా నేర సమీక్షా సమావేశం జరగ్గా నేరాల నియంత్రణపై సమీక్షించారు. జైలు నుంచి విడుదలైన నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టిసారించాలన్నారు.