NLR: నాయుడుపేట డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం వద్ద ఆదివారం రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలలో పాల్గొనే నెల్లూరు జిల్లా జట్టుకు అండర్-19 విభాగంలో క్రీడాకారులను ఎంపిక చేశారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సారథ్యంలో జరిగే ఈ పోటీలకు గురుకులం నుంచి 8 మంది, సూళ్లూరుపేట బాలికల గురుకులం నుంచి 8 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.