VZM: రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో ఆదివారం గంట్యాడ మండలం నరవ గ్రామానికి చెందిన పలు కుటుంబీకులు YCPని వీడి TDP లో చేరారు. దాదాపు 120 కుటుంబాలకు చెందిన వారు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కర్ నాయుడు,మాజీ సర్పంచ్ సుంకరి రామునాయుడు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.