NLR: చిల్లకూరు వడ్డిపాలెం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త బండి చెంచయ్య ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన తెలిసిందే. వైసీపీ తరపున బాధిత కుటుంబ సభ్యులకు రూ.1 లక్ష నగదు చెక్కును వైసీపీ నేతలు శనివారం అందించారు. వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య చెక్కును అందించారు.