కృష్ణా: నందివాడలో సీపీఎం జిల్లా ఉపాధ్యక్షడు ఆర్ సీపీ రెడ్డి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బుడమేరు వరదల్లో పంటలు కోల్పోయిన కౌలు రైతులకు ప్రభుత్వం నష్టరిహారం చెల్లించాలన్నారు. వరదల్లో ఇళ్లు మునిగిపోయిన వారికి కొంత మందికి ఆర్థిక సాయం చేసి, కొంత మందికి చేయకపొవడం సరైనదికాదన్నారు.