KDP: అన్నమయ్య జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో నేడు జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదివారం తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి ఫిర్యాదులను సమర్పించేందుకు జిల్లా కలెక్టరేటు రావద్దని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు.