VSP: ప్రభుత్వానికి ప్రజా భాగస్వామ్యం తోడైతే సుస్థిరాభివృద్ధి సాధ్యపడుతుందని గాజువాకంలోని జీవీఎంసీ 69వ వార్డు కార్పొరేటర్ కాకిగోవిందరెడ్డి అన్నారు. ఆదివారం వార్డులో శ్రమదాన ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు. తుంగ్లాం, కాపుతుంగ్లాం, చుక్కవానిపాలెం గ్రామాలకు చెందిన 300 మంది యువత ఈ ఉద్యమంలో పాల్గొని గ్రామంలోని హిందూ శ్మశానవాటికను శుభ్రం చేశారు.