KKD: కాకినాడ DMHO కార్యాలయం వద్ద శనివారం వైద్యాధికారులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డా.రవి కుమార్ మాట్లాడుతూ.. MBBS వైద్యాధికారులకు కొనసాగిస్తున్న కోటా ప్రకారమే పీజీ వైద్య విద్యార్థుల కోర్సుల్లో ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేశారు. కొవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వర్తించిన వైద్యాధికారులకు ప్రభుత్వం గౌరవం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.