KDP: కమలాపురం మండలం కోగటం గ్రామంలోని ఇరుకు రోడ్లతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద వాహనాలు ఎదురెదురుగా వచ్చాయంటే ట్రాఫిక్ సమస్యతో గంటలు తరబడి వేచి ఉండాల్సిందేనని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. ఈ మార్గంలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఒకదానికి ఒకటి ఇరుక్కుపోవడంతో ఎవరు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అధికారులు రోడ్ల విస్తరణకు చర్యలు తీసుకోవాలని కోరారు.