KDP: పోరుమామిళ్ల పట్టణంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి ఎంపీడీవో వరప్రసాద్, మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ స్థల పరిశీలన చేశారు. కాపు బడి స్థలం అనుకూలమైన ప్రదేశంగా గుర్తించి, అన్న క్యాంటీన్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పిస్తామని తెలిపారు. సెక్రటరీ వెంకటసుబ్బయ్య, వీఆర్వో చెన్నకేశవ, టీడీపీ నాయకులు ఇమామ్ హుస్సేన్ పాల్గొన్నారు.