నెల్లూరు: రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్గా నియమితులైన నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్గా నియమితులైన ఆయనకు మంత్రి నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు.