ఏలూరు: బీరువా తాళం చెవులను మింగేసిన 20 ఏళ్ళ వ్యక్తి పొట్ట నుంచి ఏలూరు ఆయుష్ ఆస్పత్రి వైద్య నిపుణులు బయటకు తీసినట్టు ఆస్పత్రి మేనేజర్ కాశీనాథ్ జాస్తి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం అర్ధరాత్రి తర్వాత ఆస్పత్రికి వచ్చిన వ్యక్తికి ఎక్స్ రే తీసి పొట్టలో తాళం చెవులున్నట్టు నిర్దారించుకుని ఎండోస్కోపి ద్వారా పొట్ట నుంచి బయటకు తీసినట్టు వివరించారు.