BPT: కర్లపాలెం మండలం పెద గొల్లపాలెం పంచాయతీలోని మార్పు చెన్నాయపాలెం గ్రామ ప్రధాన రహదారి ప్రమాద భరితంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు రహదారి కోసుకుపోవటంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. నిత్యం స్కూల్ బస్సులు తిరుగుతున్నాయని, అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.