PLD: మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని వారు బాగుంటేనే మన పరిసరాలతో పాటు మనం బాగుంటామని మున్సిపల్ ఛైర్మన్ రఫాని పేర్కొన్నారు. చిలకలూరిపేట ముస్లిం కమ్యూనిటీ హాల్ నందు చేపట్టిన పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య సురక్షా శిబిరాన్ని సోమవారం ప్రారంభించారు. ప్రైవెటు వైద్యులు సైతం పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్యం అందించాలని కోరారు.