VSP: దసరా సెలవులతోపాటు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఉండడంతో విశాఖ నుంచి వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌కు ప్రస్తుతం తీవ్ర డిమాండ్ ఏర్పడింది. నవంబరు 26 వరకూ బెర్తులు నిండిపోయాయి. అన్ని ఏసీ క్లాసులతోపాటు స్లీపర్ క్లాస్ కోచ్‌లకు కూడా నిరీక్షణ జాబితా ఏర్పడింది. అక్టోబరు 30, 31 తేదీల్లో మాత్రం ఏసీ కోచ్‌లలో కొన్ని బెర్తులు అందుబాటులో వున్నాయని అధికారులు పేర్కొన్నారు.