SKLM: సోంపేట పట్టణం చిన్నజాలరి వీధి సమీపంలో నవజాతి శిశువు మృతదేహన్ని డ్రైనేజీలో స్థానికులు గుర్తించి సోంపేట పోలీసులకు బుధవారం సాయంత్రం సమాచారం అందించారు. స్థానిక ఎస్సై హైమావతి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నవజాతి శిశువు ఆనవాలు పోల్చుకోలేని స్థితిలో ఉండడంతో మృతదేహాన్ని సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.