ఏలూరు: జిల్లా వ్యాప్తంగా స్టేట్ హైవేలు వెళ్తున్న మార్గాలన్నింటిలో తక్షణ మరమ్మతులు చేయాలని రోడ్లు-భవనాల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఈ తరహా రోడ్లన్నీ దాదాపు 14 పైగా ఉండగా, వీటి మరమ్మతుల నిమిత్తం 6 కోట్ల 92 లక్షలను కేటాయించారు. ఈ పనులన్నింటిని పర్యవేక్షించాల్సిన బాధ్యతను విస్మరించకూడదని సలహా ఇచ్చింది.