ప్రకాశం: కనిగిరి ప్రాంతీయ రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం రాత్రి స్థానిక కనిగిరి పట్టణంలోని శివనగర్ కాలనీలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను రజక సంఘ సభ్యులు, బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పోరాటాలకు ఆదర్శంగా నిలిచిన మహోన్నత వ్యక్తి చాకలి ఐలమ్మ అని తెలిపారు.