GNTR: గుంటూరు మార్కెట్ యార్డుకు దీపావళి పండుగను పురస్కరించుకొని గురువారం సెలవు ప్రకటించినట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి వినుకొండ ఆంజనేయులు తెలిపారు. శుక్రవారం యార్డులో యథావిధిగా క్రయ విక్రయాలు జరుగుతాయని చెప్పారు. శని, ఆదివారం సాధారణ సెలవులు ఉంటాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రైతులు గురువారం మిర్చి యార్డుకు సరుకు తీసుకురావద్దని చెప్పారు.