ASR: చింతపల్లి మండలం కుడిసింగి గ్రామానికి చెందిన కే.సురేష్ అనే విద్యార్థి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. సురేష్ డౌనూరు ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నాడు. విద్యార్థి అనారోగ్యం గురించి తెలుసుకున్న ఏటీడబ్ల్యూవో క్రాంతి కుమార్ వెంటనే అక్కడికి వెళ్లి, అతడిని ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. అనంతరం ఆ విద్యార్థిని గురువారం నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు.