కాకినాడ: యూనియన్ ప్రతినిధులతో ఐసీడీఎస్ అధికారులు, అదానీ సంస్థ ప్రతినిధులు జరిగిన చర్చలు విఫలమయ్యాయని ఎపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రావతి తెలిపారు. అంగన్వాడీ విధుల్లోకి ఆదానీ వాలంటీర్ల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ 26వ తేదీ తలపెట్టిన కలెక్టరేట్ భారీ ధర్నా యధావిధిగా కొనసాగుతుందన్నారు.