టాలీవుడ్(Tollywood) హీరోయిన్ నిత్యామీనన్(Actress Nithya Menon) ఇంట విషాదం నెలకొంది. నిత్యామీనన్ అమ్మమ్మ తుది శ్వాస విడిచింది. ఈ విషాద ఘటనను ఆమె సోషల్ మీడియాలో తెలుపుతూ ఎమోషన్ అయ్యింది. తన అమ్మమ్మ తాతయ్యలతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఓ నోట్ రాసింది. ‘ఒక శకం ముగిసింది. గుడ్ బై అమ్మమ్మ అండ్ మై చెర్రీ మ్యాన్. మరో లోకంలో కలుద్దాం’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో నిత్యామీనన్ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది.
నిత్యామీనన్ షేర్ చేసిన పోస్ట్:
నిత్యామీనన్(Actress Nithya Menon) చేసిన ఎమోషనల్ పోస్ట్‌పై పలువురు స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. నిత్యామీనన్‌ను ధైర్యంగా ఉండమని చెబుతున్నారు. తెలుగు తెరకు నిత్యామీనన్ అలా మొదలైంది సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది.
ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు..వంటి సినిమాలో విజయం సాధించింది. కొద్దికాలంలోనే ఆమె టాప్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరుకుంది. భీమ్లానాయక్, తిరు సినిమాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం నిత్యామీనన్(Actress Nithya Menon) చేతిలో రెండు, మూడు సినిమాలుండగా త్వరలోనే వాటి అప్డేట్స్ రానున్నాయి.