దక్ష నాగర్కర్ తెలుగు, కన్నడ భాషల్లోని సినిమాలో నటించింది. తెలుగులో హుషారు అనే యూత్‌ఫుల్ సినిమాలో దక్షా నటనకు మంచి మార్కులు పడ్డాయి.
హుషారు సినిమాలో తన నటనతో పాటు అదిరిపోయే అందంతో కుర్రకారు హృదయాలను ఈ ముద్దుగుమ్మ దోచుకుంది. అందంలో ఏవరికి ఏమాత్రం తీసిపోని దక్షకు ఆఫర్స్ మాత్రం అంతగా రాలేదు.
తెలుగులో ఈ హాట్ హీరోయిన్ ఏకే రావ్ పీకే రావ్ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా అంతగా ఆడలేదు. దక్ష నాగర్కర్ జాంబీ రెడ్డి సినిమాలో తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాతో దక్షా నాగర్కర్ కు మంచి ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత బంగార్రాజు సినిమాలో గ్లామర్ పాత్రలో కనిపించింది. ఆ సినిమాలో నాగచైతన్యతో ఓ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది.
ఈ హీరోయిన్ ప్రస్తుతం రవితేజ రావణాసురలో నటిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ (Sudheer Varma) తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే దక్ష తాజాగా కొన్ని పిక్స్‌ను నెట్టింట షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.