Colors Swati: కలర్స్ స్వాతి విడాకులు? ఇదే క్లారిటీ
సెలబ్రిటీల జీవితాల్లో తరచుగా వినిపించే మాట విడాకులు. కొంతమంది లైఫ్‌ను తమ భాగస్వామితో కలిసి లీడ్ చేస్తుంటే.. కొందరు మాత్రం కొన్నాళ్లకే విడిపోతున్నారు. ఈ మధ్య టాలీవుడ్లో విడాకుల వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఫేమస్ యాంకర్, నటి కలర్స్ స్వాతి కూడా విడాకులు తీసుకోబోతుందనే న్యూస్ వైరల్‌గా మారింది. అందుకు ఫ్రూఫ్ కూడా చూపిస్తున్నారు.
నాగ చైతన్య, సమంత మొదలుకొని.. నిన్న నిహారిక, చైతన్య వరకు విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ అవుతునే ఉంది. ఇక ఇప్పుడు మరో సెలబ్రిటీ డివోర్స్ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, కలర్స్ ప్రోగ్రాం ద్వారా చాలా పాపులర్ అయిన స్వాతి రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. కలర్స్ ప్రోగ్రాంతో కలర్స్ స్వాతిగా మారిపోయింది అమ్మడు. అదే పేరుతో బుల్లితెరపై పలు ప్రోగ్రామ్స్ చేసిన స్వాతి.. ఆ తర్వాత హీరోయిన్గా కూడా రాణించింది. తను నటించిన సినిమాల్లో అష్టచమ్మా, స్వామిరారా, కార్తికేయ, త్రిపుర వంటి సినిమాలతో హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది.
అయితే హీరోయిన్గా కెరీర్ ఫేడవుట్ అవుతున్న సమయంలో.. 2018 సంవత్సరంలో వికాస్‌ని ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది స్వాతి. వికాస్ వాసు వృత్తిరీత్యా పైలట్. వివాహం అనంతరం ఈ జంట విదేశాల్లో సెటిల్ అయ్యారు. అప్పటి నుంచి సినిమాలకు దూరమైన స్వాతి.. వైవాహిక జీవితాన్ని బాగానే ఎంజాయ్ చేస్తోంది. ఇక అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో.. ఆమె విడాకులు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నారనే టాక్ నడుస్తోంది. కానీ తాజాగా ఆమె సోషల్ మీడియాలో చేసిన ఓ పనికి విడాకులు కన్ఫామ్ చేసేశాయి సోషల్ మీడియా వర్గాలు.
తాజాగా కలర్స్ స్వాతి ఇన్స్టాగ్రామ్ నుండి భర్త ఫోటోలు డిలీట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఉన్న ప్రచారానికి మరింత బలమిస్తూ.. ఉన్నట్టుండి ఫోటోలు తీసేయడంతో.. విడాకులు తీసుకోబోతున్నట్టు హింట్ ఇచ్చిందని అంటున్నారు. ఎందుకంటే.. గతంలో సమంత, నాగచైతన్యతో విడిపోయేటప్పుడు ఇలాంటి పనే చేసింది. రీసెంట్గా మెగా డాటర్ నిహారిక కూడా ఇలాగే చేసింది. ఇక ఇప్పుడు వీళ్ల దారిలోనే స్వాతి కూడా వెళ్తున్నట్టే కనిపిస్తోంది. మరి దీనిపై కలర్స్ స్వాతి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.