నందమూరి తారకరత్నకు బెంగళూరులో చికిత్స కొనసాగుతోంది. నారా లోకేస్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్రలో తారకరత్నకు గుండెపోటు రావడంతో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స అందిస్తున్నారు. తారకరత్న ఇప్పటికీ కోలుకోలేకపోవడంతో సోషల్ మీడియాలో ఆయనపై రకరకాల వార్తలు ప్రత్యక్షం అవుతున్నాయి. తాజాగా తారకరత్న చివరి కోరిక ఏంటనేది నెట్టింట వైరల్ అవుతోంది. తారకరత్నకు తన బాలయ్య అంటే చాలా ప్రేమ. బాలయ్యకు కూడా తారకరత్న అంటే చాలా ఇష్టం. అందుకే తారకరత్నకు అలా జరిగిందని తెలియగానే బాలయ్య బెంగళూరుకు షిప్ట్ అయ్యారు.
తనకు ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ పక్కన పెట్టి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నాడు. తారకరత్నకు కావాల్సిన అవసరాలను దగ్గరుండిమరీ బాలయ్య చూసుకుంటున్నాడు. తారకరత్నకు బాలయ్య కలిసి నటించాలని కోరిక ఉండేదట. ఇప్పటి వరకూ వీరిద్దరూ కలిసి స్క్రీన్ ను షేర్ చేసుకోలేదు. ఇన్నేళ్లూ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ బాలయ్యతో కలిసి తాను ఒక్క సినిమాలో కూడా నటించలేదనే బాధ ఉందని పలు ఇంటర్వ్యూలలో తారకరత్న చెప్పుకొచ్చాడు. మరి తారకరత్న కోలుకున్నాక బాలయ్యతో కలిసి నటిస్తాడో లేడోననేది తెలియాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే. ప్రస్తుతం తారకరత్న చివరి కోరిక ఇదేనంటూ సోషల్ మీడియాలో ఈ టాపిక్ వైరల్ అవుతోంది.