Actor Roshan: మెగాస్టార్‌తో శ్రీకాంత్ కొడుకు పాన్ ఇండియా సినిమా!
హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు రెండు సినిమాలు చేసిన రోషన్.. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్‌తో కలిసి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అయితే మెగాస్టార్ అంటే.. మన మెగాస్టార్ చిరంజీవి కాదు.. మళయాళ మెగాస్టార్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ డీటెల్స్ ఓసారి చూస్తే..
‘నిర్మలా కాన్వెంట్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక. ఆ తర్వాత రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షనలో ‘పెళ్లి సందడి’ సినిమా చేశాడు. ఈ సినిమాతో పర్వాలేదనిపించుకున్నాడు రోషన్. ఈ సినిమాతోనే ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ కేక్‌లా మారిన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా పరిచయం అయింది. ఇక ఈ సినిమా తర్వాత రోషన్ పలు ప్రాజెక్ట్స్‌ను లైన్లో పెట్టే పనిలో ఉన్నాడు. కానీ ఇప్పుడు మళయాళ మెగాస్టార్ మోహన్ లాల్ సినిమాలో కీ రోల్ ప్లే చేయబోతున్నాడు.
మోహన్‌లాల్ ‘వృషభ’ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో రోషన్, మోహన్ లాల్ కొడుకు పాత్రలో కనిపించబోతున్నాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. మామూలుగానే మోహన్ లాల్ ఓ సినిమా చేస్తున్నాడంటే.. సాలిడ్ కంటెంట్ ఉండాల్సిందే. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా మళయాళంలో మోహన్ లాల్ నటించిన లూసీఫర్ రీమేక్‌గా తెరకెక్కింది. ప్రస్తుతం పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘మలైకోటై వాలిబన్’ అనే సినిమాలో నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన మలైకోటై వాలిబన్ ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్లు అంచనాలు పెంచేశాయి. దీంతో పాటు ఇంకొన్ని సినిమాలు చేస్తున్నాడు మోహన్ లాల్. ఇక ఇప్పుడు యంగ్ హీరో రోషన్‌తో కలిసి ‘వృషభ’ అనే సినిమా చేస్తున్నాడు. తెలుగు, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. బాలాజీ టెలీఫిలిమ్స్, కనెక్ట్ మీడియా, ఏవీస్ స్టూడియోస్ బ్యానర్లపై ఏక్తాకపూర్, వరుణ్ మథుర్, అభిషేక్ వ్యాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నందకిశోర్ దర్శకత్వం వహిస్తున్నాడు. 2024లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా రోషన్ సాలిడ్ ప్రాజెక్ట్‌తో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని చెప్పొచ్చు.