పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మొదటి పోస్ట్ చేశారు. సినీ ప్రముఖులతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ పవన్ ఓ నోట్ రాసుకొచ్చారు. ప్రస్తుతం పవన్ షఏర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఈ మధ్యనే సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా ఫాలోవర్స్ పెరిగారు. ఒక్క పోస్ట్ కూడా పెట్టకుండానే ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.4 మిలియన్ల ఫాలోవర్లు వచ్చి రికార్డు నెలకొల్పారు. ఇన్ స్ట్రాగ్రామ్ లో పవన్ మొదటి పోస్ట్‌గా ఏం పెడుతారా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా శనివారం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన ఇన్‌స్టాగ్రామ్‌లో మొదటి పోస్ట్ షేర్ చేశారు. ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు అంటూ రెండు నిమిషాల 40 సెకన్లు ఉన్న వీడియోను ఆయన పోస్ట్ చేశారు. మన బంధం ఇలాగే కొనసాగాలని, మరెన్నో మధురమైన జ్ఞాపకాల్ని పంచుకోవాలని ఆ వీడియోకి క్యాప్షన్ ఇవ్వడం విశేషం. వీడియోలో చలనచిత్ర పరిశ్రమలో భాగమై ఎంతో మంది ప్రతిభావంతులతో, నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తుందుకు కృతజ్ఞుణ్ణి అంటూ నోట్ రాసుకొచ్చారు.
అన్నయ్య చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, అమితాబ్ బచ్చన్ తో తాను దిగిన ఫోటోలను పవన్ షేర్ చేశారు. చిత్ర పరిశ్రమలో ప్రముఖులతో తీసుకున్న ఫోటోలను పవన్ ఈ సందర్భంగా షేర్ చేశారు. హీరోలు, హీరోయిన్లు, కమెడీయన్లు, సంగీత దర్శకులు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు, తమిళ హీరోలు అందరితో పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటోలను వీడియో రూపంలో అందించారు. వీడియో చివర్లో మన బంధం ఇలాగే కొనసాగాలని, మరెన్నో మధురమైన జ్ఞాపకాల్ని పంచుకోవాలని ఆశిస్తూ మీ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అంటూ నోట్ రాసుకొచ్చారు.