టాలీవుడ్ యంగ్ హీరో నందు(Hero Nandu) వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన అటు హీరోగానూ ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ, యాంకర్ గానూ బిజీ షెడ్యూల్ తో ఉన్నారు. తాజాగా ఆయన స్టిక్ తో ఉన్న ఫోటోలను నెట్టింట షేర్ చేశారు.
టాలీవుడ్ యంగ్ హీరో నందు(Hero Nandu) వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన అటు హీరోగానూ ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ, యాంకర్ గానూ బిజీ షెడ్యూల్ తో ఉన్నారు. సింగర్ గీతామాధురి(Singer Geetha madhuri)ని వివాహం చేసుకుని ఒక పాపతో, ఫ్యామిలీతో ఎంతో సంతోషంగా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఈ మధ్య ఆయన “బొమ్మ బ్లాక్ బస్టర్” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా(Movie) పర్వాలేదనిపించింది. ప్రస్తుతం ఆయన పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. అలాగే క్రికెట్ షో(Cricket Shows)లకు కూడా యాంకరింగ్ చేస్తున్నాడు.
ఇటీవలె నందు(Nandu)కు యాక్సిడెంట్ అవ్వడంతో ఆపరేషన్ జరిగింది. ఆయన కాలుకు తీవ్రంగా గాయం అయ్యింది. దీంతో సోషల్ మీడియాలో ఆయన కాలుకు కట్టు కట్టుకుని ఉండే ఫోటోను షేర్ చేశారు. కట్టుతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఆయన ప్రమాదం గురించి తెలియజేశాడు. తాను కోలుకోవడానికి ఇంకా ఆరు నెలల సమయం పడుతుందని తెలిపారు. దీంతో నందు త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా కొందరికి ఇలా జరిగితే విశ్రాంతి తీసుకుంటారు. కానీ నందు మాత్రం అలా చేయలేదని, ఎంతో డెడికేషన్ తో వర్క్ చేస్తున్నారని నెటిజన్లు నందును ప్రశంసిస్తున్నారు.
నందు(Nandu) తన కాలుకు కట్టు పడి నడవలేని స్థితిలో ఉన్నా కూడా యాక్టీవ్ గానే ఉంటూ ఇంట్లోనే ఏదోకటి చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా నందు(Nandu) డబ్బింగ్ స్టూడియోకి వచ్చి డబ్బింగ్ చెప్పారు. తాను నడవలేని స్థితిలో ఉన్నా కూడా ఇంటి నుంచి డబ్బింగ్ స్టూడియోకు వచ్చి డబ్బింగ్ చెప్పారు. స్టిక్ ఆధారంగా కూర్చుని కాలును పైకి పెట్టి ఇటీవలె తాను నటించిన పాత్రకు డబ్బింగ్ చెప్పారు. ఇలాంటి స్థితిలో కూడా నందు(Nandu) వర్క్ చేస్తున్నందుకు నెటిజన్లు ఆయన్ని ప్రశంసిస్తున్నారు. నందు(Nandu) త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నందు స్టిక్ తో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.