నేచురల్ స్టార్ నాని కొత్త సినిమాను ప్రారంభించాడు. టాలీవుడ్ లో హీరోగా, నిర్మాతగా వరుస హిట్లు అందుకుంటూ నాని దూసుకుపోతున్నాడు. ఈ తరుణంలో తాజాగా తన 30వ సినిమాని ప్రారంభించాడు. ఇటీవల న్యూ ఇయర్ కానుకగా ఈ మూవీని ప్రకటించిన నాని నేడు పూజ కార్యక్రమాలు చేసి సినిమాకి క్లాప్ కొట్టాడు. ఈ లాంచ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి, రైటర్ విజయేంద్ర ప్రసాద్, దర్శకులు హను రాఘవపూడి, బుచ్చిబాబు, నిర్మాత అశ్విని దత్ తో పాటు చిత్ర యూనిట్, ప్రముఖులు పాల్గొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ సీన్ కి క్లాప్ కొట్టగా, విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ పేపర్లు అందించి నాని సినిమాను ప్రారంభించారు. హను రాఘవపుడి మొదటి షాట్ కి డైరెక్షన్ చేశాడు. ఇకపోతే ఈ సినిమాలో నాని మరోసారి తండ్రి పాత్రలో నటించనున్నాడు. గతంలో జెర్సీ సినిమాలో ఫాదర్ గా చేసిన నానికి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు తండ్రి కూతుళ్ళ కథతో మరోసారి ఆడియన్స్ మనసులను దోచుకోవడానికి నాని సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. కొత్త దర్శకుడు ‘శౌర్యువ్’ ఈ సినిమాకి డైరెక్షన్ చేయనున్నాడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.