Agent First Single: ‘ఏజెంట్’ నుంచి ‘మళ్లీ మళ్లీ’ లిరికల్ సాంగ్ రిలీజ్
అక్కినేని హీరో అఖిల్(Akhil) 'ఏజెంట్'(Agent) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో ''ఏజెంట్''(Agent) సినిమా తెరకెక్కుతోంది. తాజాగా 'ఏజెంట్'(Agent) సినిమా నుంచి లిరికల్ సాంగ్(Lyrical Song)ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది.
అక్కినేని హీరో అఖిల్(Akhil) ‘ఏజెంట్'(Agent) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో ”ఏజెంట్”(Agent) సినిమా తెరకెక్కుతోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్(Spy Action Thriller) జోనర్లో ‘ఏజెంట్’ మూవీ సాగుతుంది. ఈ మూవీని అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 28వ తేది ఈ సినిమాను విడుదల(Movie Release) చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
తాజాగా ‘ఏజెంట్'(Agent) సినిమా నుంచి లిరికల్ సాంగ్(Lyrical Song)ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ”మళ్లీ మళ్లీ నువ్వే ఎదురెదురొస్తే” అంటూ సాగే ఈ పాట తెలుగు, ఇంగ్లిష్ మిక్స్ అయ్యి ఉంది. హిప్ హాప్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ పాటను కూడా హిప్ హాప్ పాడారు. ఈ పాటకు సంబంధించి హీరోహరోయిన్లు ఫారిన్ లొకేషన్ లో డ్యూయెట్ పాడుకుంటున్నట్లు చిత్రీకరించారు. ఈ పాట బీట్ తో సాగినా ఏదో కంఠస్తం చేసిన పాఠాన్ని అప్పజెప్పినట్లుగా అనిపిస్తుంది.
‘ఏజెంట్'(Agent) సినిమా ద్వారా సాక్షి వైద్య తెలుగు తెరపై ఎంట్రీ ఇస్తోంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammotty) ఈ సినిమాలో కల్నల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో భారీ యాక్షన్ దృశ్యాలు ఉంటాయి. ఈ సినిమాను ఎక్కువ భాగం విదేశాల్లోనే చిత్రీకరించారు. అందుకే విడుదల విషయంలో కాస్త ఆలస్యం అవుతోంది. ఈ మూవీతో అఖిల్(Akhil) మరో హిట్ కొట్టడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.