Kiran Abbavaram-Mass Raja : మాస్ రాజాతో పోటీ పడుతున్న కిరణ్ అబ్బవరం!
Kiran Abbavaram-Mass Raja : ప్రస్తుతం వరుస సినిమాలతో దూకుడు మీదున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. అది కూడా టాలీవుడ్ బడా సంస్థల నిర్మాణంలో సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్గా గీతా ఆర్ట్స్‌లో చేసిన 'వినరో భాగ్యము విష్ణుకథ' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు.
ప్రస్తుతం వరుస సినిమాలతో దూకుడు మీదున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. అది కూడా టాలీవుడ్ బడా సంస్థల నిర్మాణంలో సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్గా గీతా ఆర్ట్స్‌లో చేసిన ‘వినరో భాగ్యము విష్ణుకథ’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమా కిరణ్‌కు కాస్త బూస్టింగ్ ఇచ్చింది. గీతా ఆర్ట్స్ ప్రమోషన్స్ బాగా కలిసి వచ్చింది. ఇదే ఊపులో అప్ కమింగ్ సినిమాలను థియేటర్లోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. నెక్స్ట్ అబ్బవరం నుంచి ‘మీటర్’ అనే సినిమా రాబోతోంది. ఈ సినిమా కూడా బడా బ్యానర్లోనే వస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్ టైన్ మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించింది. రమేష్ కడూరి అనే కొత్త డైరెక్టర్ పరిచయం అవుతున్నాడు. ఇప్పటి వరకు కిరణ్ చేసిన సినిమాల్లో మీటర్.. పక్కా మాస్ ఎంటర్టైనర్గా రాబోతోంది. ఈ సినిమాను ఏప్రిల్ 7న రిలీజ్ చేయబోతున్నారు. అయితే అదే రోజు మాస్ మహారాజా రవితేజ నటించిన ‘రావణాసుర’ మూవీ రిలీజ్ అవుతోంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరెక్కుతోంది. ఈ సినిమాపై అంచనాలు కాస్త గట్టిగానే ఉన్నాయి. దాంతో మాస్ రాజాతో పోటీ అంటే.. కిరణ్ అబ్బవరం రిస్క్ చేస్తున్నాడా అనే డౌట్ రాక మానదు. కానీ మైత్రీ మూవీ మేకర్స్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. మీటర్‌కు థియేటర్ల కొరత లేనట్టే. అయితే రవితేజ లాంటి హీరో రేసులో ఉన్నప్పుడు.. ఆడియెన్స్ ఫస్ట్ ఛాయిస్ రావణాసుర మూవీనే అవుతుంది. ఇప్పటికే ధమాకా, వాల్తేరు వీరయ్య సక్సెస్‌తో ఊపు మీదున్నాడు రవితేజ. కాబట్టి కిరణ్ అబ్బవరం మాస్ మహారాజాతో పోటీని ఎంతవరకు తట్టుకుండానేది వేచి చూడాల్సిందే.