'అమిగోస్' రివ్యూ! : కొత్త కంటెంట్, కొత్త డైరెక్టర్లకు కేరాఫ్ అడ్రస్ నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన చేసిన సినిమాల్లో సగానికి పైగా కొత్త డైరెక్టర్స్‌తోనే పని చేశాడు. లాస్ట్ బ్లాక్ బస్టర్ బింబిసారతోను మల్లిడి వశిష్టిను దర్శకుడిగా పరిచయం చేశాడు. ఆ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాంతో ఆయన మార్కెట్‌తో పాటు.. అప్ కమింగ్ సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే అమిగోస్ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమాతో రాజేంద్ర రెడ్డి అనే డైరెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' హిట్స్ అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్.. అమిగోస్‌తో హ్యాట్రిక్ కొట్టేయాలని చూస్తోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ చేశాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందుకే నందమూరి అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడిలో అంచనాలు పెరిగిపోయాయి. మరి అమిగోస్ అంచనాలను అందుకుందా.. కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం ఎలా ఉంది.. సినిమా హిట్టా, ఫ్లాపా.. ఎలా ఉందో చూద్దాం!
కొత్త కంటెంట్, కొత్త డైరెక్టర్లకు కేరాఫ్ అడ్రస్ నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన చేసిన సినిమాల్లో సగానికి పైగా కొత్త డైరెక్టర్స్‌తోనే పని చేశాడు. లాస్ట్ బ్లాక్ బస్టర్ బింబిసారతోను మల్లిడి వశిష్టిను దర్శకుడిగా పరిచయం చేశాడు. ఆ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాంతో ఆయన మార్కెట్‌తో పాటు.. అప్ కమింగ్ సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే అమిగోస్ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమాతో రాజేంద్ర రెడ్డి అనే డైరెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. సంక్రాంతికి ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ హిట్స్ అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్.. అమిగోస్‌తో హ్యాట్రిక్ కొట్టేయాలని చూస్తోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ చేశాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందుకే నందమూరి అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడిలో అంచనాలు పెరిగిపోయాయి. మరి అమిగోస్ అంచనాలను అందుకుందా.. కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం ఎలా ఉంది.. సినిమా హిట్టా, ఫ్లాపా.. ఎలా ఉందో చూద్దాం!
కథ విషయానికొస్తే.. ట్రైలర్లో చూపించినట్టుగానే, ఒక వెబ్ సైట్ ద్వారా అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉండే సిద్దార్థ్.. మంజునాథ్.. మైఖేల్ కలుస్తారు. సిదార్థ్ హైదరాబాద్‌లో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉంటాడు. తన మావయ్య(బ్రహ్మాజీ)తో సరదాగా గడుపుతుంటాడు. అలాంటి సమయంలో సిధ్దార్థ్కు డోపెల్ గ్యాంగర్ అనే వెబ్ సైట్ గురించి తెలుస్తుంది. ఈ క్రమంలోనే అతనికి బెంగళూరుకు చెందిన మంజునాథ్, కోల్ కత్తాలో ఉండే మైఖేల్ టచ్ లోకి వస్తారు. ఇంకేముంది.. ఈ ముగ్గురు గోవాలో కలుసుకుని ఎంజాయ్ చేయాలనుకుంటారు. అయితే అప్పటికే రేడియో జాకీ అయిన ఇషికా (ఆషికా రంగనాథ్)తో ప్రేమలో పడతాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ ప్రేమకు సాయం చేసేందుకు మిగిలిన ఇద్దరూ హైదరాబాద్ వస్తారు. అనుకున్నట్టే ఆమెను ప్రేమలో పడేసి.. నిశ్చితార్థం వరకు వెళ్తుంది వ్యవహారం. అయితే అప్పటికే మైఖేల్ కోసం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్.ఐ.ఎ.) వెతుకుతూ ఉంటుంది. వీళ్లు ముగ్గురు ఒకేలా ఉండడంతో.. అనుకోకుండా మంజునాథ్‌ను అరెస్ట్ చేస్తారు. అయితే ఇదంతా మైఖేల్ స్కెచ్.. అని తర్వాత తెలుస్తుంది. మరి మైఖేల్ ఎందుకిలా చేశాడు.. ఎవరతను.. రాక్షసరూపం కలిగిన అతని నుంచి.. మిగతా ఇద్దరు ఎలా తప్పించుకున్నారు.. అనేదే అసలు కథ.
అమిగోస్ గురించి చెప్పాలంటే.. అదిరిపోయే కాన్సెప్టే.. కానీ తెరపై ప్రజెంట్ చేయడంలో కాస్త విఫలమయ్యారనే చెప్పాలి. కళ్యాణ్ రామ్‌ను ట్రిపుల్ రోల్లో చూపించి.. వాళ్ల నేపథ్యం వేరుగా చూపించాడు. సిద్దార్ధ్ బిజినెస్ మెన్, మంజునాథ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్, మైఖేల్ గ్యాంగ్ స్టర్‌గా చూపించాడు. దాంతో ఆటోమేటిక్‌గా మెఖేల్ క్యారెక్టర్ పైనే ఆడియెన్స్ దృష్టి ఎక్కువగా ఉంటుంది. పైగా అది విలన్ రోల్. అందుకేనేమో.. మైఖేల్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టి.. మిగతా పాత్రలను తేల్చేసినట్టుగా అనిపిస్తుంది. అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం ఎగ్జైటింగ్‌గా అనిపిస్తుంది. అలాగే సెకండాఫ్‌లో మైఖేల్ పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్‌లో కళ్యాణ్ రామ్ లుక్కు ఎగ్జైట్ అవుతాం.. కానీ ఆ లుక్ ఉన్నంత కొత్తగా పాత్ర లేకపోయింది. దాంతో సినిమాను లాగినట్టే అనిపిస్తుంది. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం ట్రిపుల్ రోల్లో అదరగొట్టేశాడు. ఈ సినిమా తర్వాత హీరోయిన్ ఆషికా రంగనాథ్‌కు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. జిబ్రాన్ నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. ‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ..’ సాంగ్ చూడటానికి బావుంది. కానీ కథలో దమ్ములేకపోవడంతో అమిగోస్ సోసోగానే సాగిపోయింది. దర్శకుడు కొంతవరకు బాగానే డీల్ చేసినా.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. కానీ డోపెల్ గ్యాంగర్ వెబ్ సైట్ గురించి తెలుసుకోవడం ఇంట్రెస్టింగ్ పాయింట్.
ఫైనల్‌గా.. దర్శకుడు రాజేంద్ర రెడ్డి ఓ కొత్త పాయింట్ తీసుకున్నప్పటికీ.. ఒక కమర్షియల్ సినిమాను చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అయినా అమిగోస్ థియేటర్లో నిలబడడం కష్టమే.. ఒకసారి చూడొచ్చు.