Allu Arjun : ప్రస్తుతం ఇండియాలో భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ప్రభాస్‌దే ఫస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఒక్కో సినిమాకు 100 నుంచి 150 కోట్లు తీసుకుంటున్నాడు డార్లింగ్. అయితే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్రభాస్ పారితోషికాన్ని టచ్ చేసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇండియాలో భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ప్రభాస్‌దే ఫస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఒక్కో సినిమాకు 100 నుంచి 150 కోట్లు తీసుకుంటున్నాడు డార్లింగ్. అయితే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్రభాస్ పారితోషికాన్ని టచ్ చేసినట్టు తెలుస్తోంది. పుష్ప మూవీతో భారీ పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పుష్ప2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఈ సినిమా కోసం బన్నీ ఏకంగా వంద కోట్లు డిమాండ్ చేస్తున్నాడని గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు అప్ కమింగ్ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 120 కోట్లు అందుకోబోతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్గా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో.. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించాడు ఐకాన్ స్టార్. టీ సిరీస్ సంస్థ పై భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఆదిపురుష్‌ని కూడా ఈయనే నిర్మిస్తున్నారు. దాంతో సందీప్ రెడ్డి సినిమా కోసం అల్లు అర్జున్‌కు 120 కోట్ల పారితోషికం ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే సౌత్ ఇండియా నుంచి.. ప్రభాస్ తర్వాత భారీ పారితోషికం అందుకుంటున్న హీరో అల్లు అర్జునేనని చెప్పొచ్చు. ఇక సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ 2025లో పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ప్రభాస్ ‘స్పిరిట్’ అయిపోగానే ఈ సినిమా స్టార్ట్ కానుంది. ఈలోపు బన్నీ కూడా త్రివిక్రమ్‌తో ఓ సినిమా కంప్లీట్ చేయాల్సి ఉంది. ఆ తర్వాతే ఈ క్రేజీ కాంబో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాను సందీప్ రెడ్డి తనదైన స్టైల్లో ఊరమాస్‌గా ప్లాన్ చేస్తున్నాడు.