అక్కినేని అఖిల్(Akkineni Akhil) హీరోగా ఏజెంట్ మూవీ (Agent Movie) తెరకెక్కుతోంది. ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధమైంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surendar Reddy) ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి పోస్టర్స్, టీజర్, సాంగ్స్(Songs) విడుదల అయ్యాయి. ఏజెంట్ మూవీపై అవి అంచనాలను పెంచేలా చేశాయి. అఖిల్ నటిస్తున్న ఈ మూవీ స్పై యాక్షన్ థ్రిల్లర్ (Spy action Thriller)గా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ (Trailer)ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఏజెంట్ మూవీ ట్రైలర్:
ప్రస్తుతం ఏజెంట్ మూవీ(Agent Movie)కి సంబంధించిన ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా మంగళవారం కాకినాడలో ఏజెంట్ మూవీ ట్రైలర్(Agent Movie Trailer) లాంచ్ ఫంక్షన్ జరిగింది. తాజాగా ఈ మూవీ రన్ టైమ్ లాక్ అయ్యింది. 2 గంటల 32 నిమిషాలుగా ఏజెంట్ మూవీ రన్ టైమ్ ను చిత్ర యూనిట్ లాక్ చేసింది. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఏజెంట్ మూవీ(Agent Movie)లో అఖిల్ డేరింగ్ స్టంట్స్ అందర్నీ అవాక్కయ్యేలా చేస్తాయని డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెలిపారు. ట్రైలర్(Trailer)లో సరికొత్త మేకోవర్‌తో అఖిల్(Akkineni Akhil) సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి(Mammootty) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా సాక్షి వైద్య(Sakshi vydya) తెలుగు తెరపై ఎంట్రీ ఇస్తోంది. ఏప్రిల్ 28వ తేదిన ఈ మూవీని గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్(Release) చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.