బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ పై మరో నటి నోరా ఫతేహి పరువునష్టం దావా వేసింది. మనీలాండరింగ్ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని నోరా ఫతేహి కోర్టును ఆశ్రయించింది. దీంతో ఢిల్లీ కోర్టులో జాక్వెలిన్ పై క్రిమినల్ కేసు నమోదైంది. తన గౌరవప్రతిష్టలు భంగపరిచి, సినీ కెరీర్ ను దెబ్బ తీసిందని నోరా ఫతేహి ఫిర్యాదులో తెలిపింది.
అంతేకాకుండా నోరా ఫతేహిని కించపరుస్తూ వార్తలు రాసిన 15 మీడియా సంస్థలపై కూడా కేసు వేసింది. దీంతో ఆమె దాఖలు చేసిన పరువు నష్టం కేసును న్యూఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు మార్చి 25న విచారించనుంది. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో సుఖేష్ చంద్రశేఖర్ అరెస్ట్ అయ్యారు. ఆ కేసులో జాక్వెలిన్ ను ఈడీ విచారించగా ఆమె నోరా ఫతేహి పేరు చెప్పింది. దీంతో తనను ఇరికించేందుకే జాక్వెలిన్ అలా చేసిందని నోరా ఫతేహి కోర్టును ఆశ్రయించింది.