2018 Movie: 2018 ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. లాభం ఎంతంటే!?
కొన్ని సినిమాలు ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర అద్భుతం చేస్తుంటాయి. ఇప్పటికే కాంతార, లవ్ టుడే లాంటి డబ్బింగ్ సినిమాలు తెలుగులో భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. ఇక పోయిన వారం రిలీజ్ అయిన మళయాళ బ్లాక్ బస్టర్ 2018 కూడా అదిరిపోయే కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది.
టోవినో థామస్(Tovino Thomas) హీరోగా నటించిన మలయాళ మూవీ 2018 కేరళ బాక్సాఫీస్‌ని షేక్ చేసేసింది. కేవలం 16 కోట్ల బడ్జట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. ఇప్పటివరకు 180 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టి.. 200 కోట్ల దిశగా పరిగెడుతూ.. అక్కడ రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచేలా ఉంది. దాంతో ఈ సినిమాను తెలుగులో గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పైన బన్నీ వాసు డబ్బింగ్ చేసి రిలీజ్ చేశాడు. అంతంత మాత్రమే ప్రమోషన్స్‌తో థియేటర్లోకి వచ్చిన 2018 మూవీకి.. తెలుగు సినీ అభిమానులు భారీ విజయాన్ని ఇచ్చారు. దాంతో భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి.
రోజు రోజుకీ కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఈ వారం రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో ఏది కూడా సాలిడ్ హిట్ టాక్ రాబట్టలేకపోయింది. దాంతో మరో వారం పాటు ఈ సినిమాదే హవా ఉండే ఛాన్స్ ఉంది. తెలుగులో రెండు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న ఈ సినిమా.. మొదటి వారంలో మూడు కోట్ల యాభై లక్షల రూపాయిల షేర్ వసూలు చేసింది. గ్రాస్ ప్రకారం ఏడున్నర కోట్లు రాబట్టింది. ఇక 8 రోజుల్లో 8.21 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. దీంతో ఫస్ట్ వీక్‌లోనే ఈ సినిమా దాదాపు రెండు కోట్ల వరకు లాభాలను తెచ్చిపెట్టిందని చెప్పాలి.
అంతేకాదు ఈ వీకెండ్ వరకు 10 కోట్ల మార్క్‌ని టచ్ చేస్తుందని అంటున్నారు. 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎమోషనల్ డ్రామాకు ఆడియెన్స్ చాలా కనెక్ట్ అయిపోయారు. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన ఈ సినిమాను.. ఆంటోని జోసెఫ్ దర్శకత్వం వహించాడు. అయితే ఇంకా థియేటర్లో రన్ అవుతున్న ఈ సినిమాను.. జూన్ 7 నుంచి సోనీ లివ్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఏదేమైనా కాంతార, బిచ్చగాడు 2 వంటి డబ్బింగ్ సినిమాల తర్వాత.. తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది 2018 సినిమా.