TS Budget: తెలంగాణ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2,75,891 కోట్లతో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రూ.2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.29,669 కోట్ల మూలధన వ్యయంతో బడ్జెట్ను ప్రతిపాదించారు. మార్పు కావాలని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారని, వాళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరు గ్యారంటీల అమలుకు రూ.53,196 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు
వ్యవసాయానికి రూ.19.746 కోట్లు
ఐటీ శాఖకు రూ.774 కోట్లు
పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు
విద్యా రంగానికి రూ.21,389 కోట్లు
మూసీ ప్రాజెక్టుకు రూ.1,000 కోట్లు
వైద్య రంగానికి రూ.11,500 కోట్లు
ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.21,874 కోట్లు
గృహ నిర్మాణ రంగానికి రూ.7,740 కోట్లు
మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2,262 కోట్లు